చెన్నై బాక్స్ ఆఫీసుని కొల్లగొడుతున్న ‘గోపాల గోపాల’

చెన్నై బాక్స్ ఆఫీసుని కొల్లగొడుతున్న ‘గోపాల గోపాల’

Published on Jan 13, 2015 4:15 PM IST

gopala-gopala-audio

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ జనవరి 10న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ సినిమా ఒక్క ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ లోనే కాకుండా చెన్నై బాక్స్ ఆఫీసు వద్ద కూడా కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. అక్కడ ఉన్న తమిళ సినిమాలకంటే ఎక్కువగా ఈ సినిమా కలెక్షన్స్ సాధిస్తోంది.

వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కలిసి నటించడం, ఆ సినిమా క్రేజ్ చూసి తమిళ సినీ అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. తమిళంలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న వెల్లైకరై దొరై, కప్పల్, సినిమాలతో పాటు ఇంగ్లీష్ మూవీ టేకెన్ 3, హిందీ మూవీ పికె సినిమాల కలెక్షన్స్ ని క్రాస్ చేసి మరీ ‘గోపాల గోపాల’ కలెక్షన్స్ ఉన్నాయి. సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాకి హెల్ప్ అవ్వడంతో కలెక్షన్స్ కి మరో వారం డోఖా లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు