పవన్ పై భజన పాటకు విపరీతమైన క్రేజ్

పవన్ పై భజన పాటకు విపరీతమైన క్రేజ్

Published on Jan 15, 2015 6:37 PM IST

Pawankalyan1
పవన్ కళ్యాణ్ కి తెలుగులో ఎంతటి ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అయితే ఈ క్రేజ్ ని మరింత రెట్టింపు చేస్తూ పవన్ భక్తులు కొందరి పవన్ పై భక్తి గీతాన్ని విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పాత హిట్ సాంగ్స్ అన్నీ తీసుకుని దానికి భజన సంగీతం జోడిస్తూ కామెడీగా తెరకెక్కించిన వీడియోలో తమ అభిమాన నటుడిపై భక్తి ఏ రేంజ్ లో వుందో కనిపిస్తుంది. అయితే త్వరగా ప్రచారం పొందడానికి వేసే ఎత్తులలో ఇదీ ఒకటి అని పలువురు విమర్శిస్తున్నారు.

ఈ వీడియో సోషల్ నెట్వర్క్ లలో భీబత్సమైన రీతిలో షేర్ అవుతుంటే పవర్ స్టార్ క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది. త్వరలో ఇటువంటి వీడియోలు మరిన్ని విడుదలవుతాయనడంలో సందేహం లేదు. పవన్ తాజాగా నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంలో అభినవ శ్రీకృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను, తన భక్తులను రంజింపచేసిన విషయం తెలిసినదే

సంబంధిత సమాచారం

తాజా వార్తలు