
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘టెంపర్’. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాలని భావించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఒక వారం పాటు వాయిదా పడింది. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతుంది. ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించారు. యువ సంగీత సంచలనం అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. త్వరలో ఆడియోను విడుదల చేయనున్నారు. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది.

