
యంగ్ టైగర్ యెన్. టి. ఆర్ పూరి జగన్నాథ్ తో కలసి ‘టెంపర్’ అనే హై వోల్టేజ్ చిత్రం తో సిద్దం అవుతున్నారు. కొన్ని సంఘటనల వల్ల ఆగిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు వేగంగా కొనసాగుతుంది.
సంక్రాంతి సెలవులకి విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఫిబ్రవరి లో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం ‘టెంపర్’ ఆడియో ఈ నెల 26న విడుదల కానుంది.
ఎన్నో హై ప్రొఫైల్ హిట్ చిత్రాలకి సంగీతం అందిస్తూ జోరు మీద వున్న అనుప్ రుబెన్స్ యెన్. టి. ఆర్ చిత్రానికి మొదటి సారి సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రేక్షకుల దగ్గర నుండి మంచి స్పందన లభిస్తుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

