
గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయింది. సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. గోపీచంద్, ప్రకాష్ రాజ్ మరియు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సోమవారం హాస్పిటల్ సన్నివేశాలను చిత్రీకరించారు.
‘లౌక్యం’ తర్వాత గోపీచంద్ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో గోపీచంద్ నటించిన యాక్షన్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తీర్చిదిద్దుతున్నాం. కథలో ప్రేమకథకు ప్రాముఖ్యత ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు బాగుంటాయి అని దర్శక నిర్మాతలు తెలిపారు.
కొమర వెంకటేష్ సమర్పణలో జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

