
తమిళనాట సూపర్ స్టార్ గా నిలిచినా ధనుష్, హిందీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లు వారివారి భాషలలో గొప్ప నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు సైతం వీరిరువురూ సుపరిచితులు కావడంతో వీరి కలయికలో వస్తున్న ”షమితాబ్” అనే హిందీ చిత్రంపై బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియన్ ప్రేక్షకుల కళ్ళు కూడా పడ్డాయి.
గతంలో ‘పా’, ‘చీనీ కమ్’ సినిమాలు తెరకెక్కించిన బల్కీ ఈ సినిమాకు దర్శకుడు. కమల్ హాసన్ రెండవ కూతురు అక్షరా హాసన్ ఈ చిత్రంతో పరిచయం కానుంది. ఇళయరాజా సంగీతదర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్ లు ప్రేక్షుకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి

