
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోలకు సమానంగా క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి. ఒక్క సౌత్ లోనే కాక యావత్ భారతదేశానికి రాజమౌళి సుపరిచితుడే. దాదాపు అన్ని భాషలవాళ్ళూ అతని అభిమానులే.
రాజమౌళి ట్విట్టర్ లో యాక్టీవ్ గా వుంటాడన్న విషయం తెలిసినదే. నేటితో జక్కన్న తన అకౌంట్ కి మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. భారతదేశంలో అతికొద్ది మంది సినిమా దర్శకులు మాత్రమే సాధించిన ఫీట్ ఇది. తన సినిమాల విషయాలలో గానీ తన మనసుకు తో గానీ జక్కన ట్విట్టర్ లో ప్రత్యక్షమవుతాడు.
రాజమౌళి ప్రస్తుతం ఏప్రిల్ లో విడుదలకావలసిన ‘బాహుబలి’ పార్ట్ 1 షూటింగ్ లో వున్నాడు. ఈ సినిమాలో రానా, ప్రభాస్ లు ప్రధాన పాత్రధారులు.

