పవన్ నిర్ణయంతో థ్రిల్ అయిన ఫ్యాన్స్

Pawan-Kalyan
ఇప్పటి వరకూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానే కాకుండా ఇకపై నిర్మాతగా కూడా మారనున్నాడని, అందులో భాగంగా మొదటి సినిమా కోసం పవన్ కళ్యాణ్ అబ్బాయి అయిన రామ్ చరణ్ ని హీరోగా ఎంచుకున్నాడు. నిన్న ఈ ప్రెస్ నోట్ విడుదల అయినప్పటి నుంచి ఇద్దరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కూడా ఇదే విషయంపై పలు చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తన ప్రొడక్షన్ హౌస్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై రామ్ చరణ్ తో చేయనున్న సినిమా వివరాలు పూర్తిగా తెలియకపోయినా మెగా అభిమానుల్లో మాత్రం ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. గత కొంత కాలంగా మెగా అభిమానుల్లో ఏదో మనస్పర్ధలు ఉన్నాయని వస్తున్న పుకార్లకు బ్రేక్ వేసేలా అనౌన్స్ చేసిన ఈ సినిమా మెగా అభిమానులను పండగ చేసుకునేలా చేయడమే కాకుండా పవన్ అభిమానులు థ్రిల్ అయ్యేలా చేసింది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

Exit mobile version