త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ – చరణ్ సినిమా..?

pawan-ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా నిర్మిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతుంది. పవన్ నిర్మాణ సంస్థ ఇటివలే ‘సర్దార్’ అనే టైటిల్ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించింది.

ఎప్పటి నుండో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలనే కోరికను రామ్ చరణ్ వ్యక్తం చేస్తున్నారు. పవన్ – త్రివిక్రమ్ అత్యంత సన్నిహితులు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాబాయి నిర్మించే తొలి సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు అయితే బాగుంటుందని చరణ్ సూచించారు. పవన్ అడగడంతో త్రివిక్రమ్ ఓకే చెప్పారని సమాచారం. గతంలో చరణ్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావించినా అది సాధ్యపడలేదు. ఇన్నాళ్ళకు వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది.

పవన్ నిర్మాత, త్రివిక్రమ్ దర్శకుడు, రామ్ చరణ్ హీరో.. ఈ కాంబినేషన్ సగటు సినీ అభిమానితో పాటు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి రేపుతుంది. అధికారిక ప్రకటన వస్తే గానీ, ఈ వార్త నిజమని నమ్మలేం.

Exit mobile version