‘బాహుబలి’కి గుమ్మడికాయ కొట్టేశారు..!

‘బాహుబలి’కి గుమ్మడికాయ కొట్టేశారు..!

Published on Apr 8, 2015 1:06 AM IST

bahu-bali
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా విషయంలో రాజమౌళి అన్నీ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సినిమాను అన్ని విధాలుగా ది బెస్ట్ సినిమాగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చిత్రీకరణ, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఫైట్స్ అన్నీ భారీ ఎత్తున తలపెట్టి విజువల్ వండర్‌గా సినిమాను తయారుచేస్తున్నారు. తాజాగా నేటితో సినిమా మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తైంది. ఈ సాయంత్రమే గుమ్మడికాయ కూడా కొట్టేశారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించబడుతోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెలాఖర్లోనే ఆడియో ఆవిష్కరణను చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ముందే ప్రకటించినట్లుగానే మే 15నే సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పోస్ట్‌ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టినా మరికొన్ని రోజుల్లో భారీ ఎత్తున సినిమా ప్రమోషన్‌ను చేపట్టనున్నారు.

తాజా వార్తలు