
ఎంతో పోటా పోటీగా జరిగిన మా ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎలక్షన్స్ లో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ కొత్త మా అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడమే కాకుండా నిన్న సాయంత్రం ఫిల్మ్ చాంబర్ లో ప్రమాణ స్వీకారం కూడా చేసారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ తను చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తానని మరోసారి మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో మొదటి నుంచి రాజేంద్ర ప్రసాద్ కి సపోర్ట్ గా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు మెగా ఫ్యామిలీ తరపున 6 లక్షల రూపాయలు మా కి అందజేశారు.
అప్పుడు నాగబాబు మాట్లాడుతూ ‘మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఇండస్ట్రీలో ఉన్న పేదలకి, కష్టాల్లో ఉన్న ఉద్యోగులను ఆదుకోవడానికి ముందుంటుంది. ఈ 6 లక్షల్లో రామ్ చరణ్ 2 లక్షలు, అల్లు అర్జున్ 2 లక్షలు, వరుణ్ తేజ్ 1 లక్ష, సాయి ధరమ్ తేజ్ 1 లక్ష ఇచ్చారని తెలియజేశాడు. ముందు ముందు కూడా ఇలానే డొనేషన్స్ ఇచ్చి మా డెవలప్ మెంట్ కి సాయపడతామని’ తెలిపాడు. ఈ కేవలం మొదలు మాత్రమె అని రాజేంద్ర ప్రసాద్ సుమార్ 5 కోట్ల వరకూ కలెక్ట్ చేసి మా మెంబర్స్ యొక్క మంచి పనుల కోసం ఉపయోగించనున్నారు.

