
ఎనేర్జిటిక్ హీరో రామ్ కి ఎన్నో యావరేజ్ చిత్రాల తర్వాత విడుదలైన కుటుంబ కధా చిత్రం ‘పండగ చేస్కో’ హిట్ తో ఊరట లభించింది. మే చివరి వారంలో విడుదలైన ఈ చిత్రం లో అన్ని ఏరియాలలో మంచి ఫలితాలని సాధిస్తుంది. ట్రేడ్ అనలిస్ట్లు అందించిన సమాచారం ప్రకారం సీడెడ్ లో ఇప్పటికే రెండు కోట్లు సంపాదించింది.
యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో కామెడీ ట్రాక్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి స్పందన రాబట్టుకుంది. రకుల్ ప్రీత్ సోనాల్ చౌహన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.

