న్యూయార్క్ మ్యుజియం లో స్టార్ డైరెక్టర్ కి అరుదైన గౌరవం

న్యూయార్క్ మ్యుజియం లో స్టార్ డైరెక్టర్ కి అరుదైన గౌరవం

Published on Jun 14, 2015 12:31 AM IST

Maniratnam

విలక్షణ దర్శకుడు మణిరత్నం కీర్తికిరీటంలో మరో రత్నం తోడయ్యింది. ‘మ్యుజియం ఆఫ్ మూవింగ్ ఇమేజ్’ లో తాను తీసిన మూడు సినిమాలు
జతచేర్చారు. రోజా, బొంబాయి, దిల్ సే సినిమాలను వచ్చే నెల 31నుండి ఆగష్టు 2వరకూ ప్రదర్శించనున్నారు. అతితక్కువ మందికి మాత్రమే
ఈ అరుదైన అవకాశం దక్కింది.

పాలిటిక్స్ యాజ్ స్పెక్టాకల్ : ది ఫిలిమ్స్ ఆఫ్ మణిరత్నం అనే టైటిల్ తో ఈ ప్రోగ్రాం నడవనుంది. ఇటీవల వస్తున్న మణిరత్నం సినిమాలు ఆశించిన
స్థాయిలో లేకపోయినా ఒకే బంగారం మంచి విజయం సాధించడంతో కాస్త ఊరట చెందాడు.

తాజా వార్తలు