ప్రభుదేవా కోరికని చిరు తీరుస్తాడా.?

ప్రభుదేవా కోరికని చిరు తీరుస్తాడా.?

Published on Jun 16, 2015 7:27 PM IST

chiranjeevi
ఒకరేమో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్.. అతనే ప్రభుదేవా. మరొకరేమో తన ఆన్ స్క్రీన్ డాన్స్ స్టెప్స్ తో తెలుగు ప్రేక్షకుల చేత స్టెప్పులేయించిన టాలీవుడ్ జాక్సన్.. అతనే మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు పనిచేసారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్, ఆ సాంగ్స్ లో చిరు వేసిన స్టెప్స్ తెలుగు వారిని ఏ రేంజ్ లో అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా కూడా వచ్చింది..

ఇది కాసేపు పక్కన పెట్టి అసలు విషయంలోకి వెళితే చాలా రోజుల తర్వాత తన 150వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్దమవుతున్నాడు. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ఆగష్టులో ప్రారంభం కానుంది. తాజాగా ప్రభుదేవా తన మనసులోని కోరికని బయట పెట్టాడు. చిరంజీవి గారు ఒప్పుకుంటే ఆయన 150వ సినిమాకి డాన్స్ మాస్టర్ గా పనిచేసి ఆయనకి స్టెప్స్ కంపోజ్ చెయ్యాలనుకుంటున్నానని ప్రభుదేవా తెలిపాడు. మరి ఈ కోరికను చిరంజీవి అంగీకరిస్తాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ అన్నీ కుదిరి ప్రభుదేవా చిరంజీవికి స్టెప్స్ కంపోజ్ చేస్తే, అప్పుడు ఆన్ స్క్రీన్ ఆడియన్స్ కి పండగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా..

తాజా వార్తలు