‘షేర్’ కోసం స్టెప్స్ వేస్తున్న కళ్యాణ్ రామ్

‘షేర్’ కోసం స్టెప్స్ వేస్తున్న కళ్యాణ్ రామ్

Published on Jun 17, 2015 1:00 AM IST

Sher
ఈ ఏడాది మొదట్లో వచ్చిన పవర్ఫుల్ పోలీస్ ఎంటర్ టైనర్ ‘పటాస్’ తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమా షూటింగ్ ‘షేర్’ని శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ ని ఇప్పుడు షూట్ చేస్తున్నారు. ఇటీవలే ఓ సాంగ్ షూట్ ని పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఈ రోజు నుంచి మరో సాంగ్ షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టారు.

నందమూరి కళ్యాణ్ రామ్ పై షూట్ చేస్తున్న ఈ పాటకి డాన్స్ మాస్టర్ జానీ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. పటాస్ సినిమాలనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. కళ్యాణ్ రామ్ సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. షేర్ లో మరోసారి కళ్యాణ్రామ్ పూర్తి మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇది కాకుండా కళ్యాణ్ రామ్ రవితేజ హీరోగా నిర్మించిన ‘కిక్ 2’ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్దమవుతోంది.

తాజా వార్తలు