
ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో వివాదాస్పద నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే! వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్’ అని వర్మ తెలిపారు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇవ్వాళే మొదలైంది. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా కోసం తమిళ నాడు, కర్ణాటకల్లోని వీరప్పన్ స్థావరాలు ఏర్పరచుకున్న ప్రదేశాలను ఇప్పటికే ఎంపిక చేశారు. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఇక ‘షూటింగ్ మొదలైంది’ అంటూ విడుదల చేసిన పోస్టర్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తలదన్నే రీతిలో ఉన్నాయి. తన మార్క్ సినిమాతో వర్మ మళ్ళీ రానున్నడానే అభిప్రాయం ఈ సినిమా అనౌన్స్ అయిన రోజునుంచీ వినబడుతూ వస్తోంది.

