స్పిన్నింగ్ మిల్స్‌లో మహేష్ ‘శ్రీమంతుడు’ షూటింగ్..!

స్పిన్నింగ్ మిల్స్‌లో మహేష్ ‘శ్రీమంతుడు’ షూటింగ్..!

Published on Jun 29, 2015 8:31 PM IST

mahesh-sri
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్‌లోని సంఘీ స్పిన్నింగ్ మిల్స్‌లో జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్ట్‌తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కానుందని సమాచారం.

ఇదిలా ఉంటే మరోపక్క ‘శ్రీమంతుడు’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతూ ఉండడం విశేషం. ఇక సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విడుదల చేసిన పోస్టర్, టీజర్‌లు విపరీతమైన అంచనాలను పెంచేయగా, సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదని దర్శకుడు కొరటాల శివ చెబుతూ వస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో జూలై 18న విడుదల కానుండగా, సినిమా ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదల కానుంది.

తాజా వార్తలు