సోగ్గాడే చిన్నినాయన షూటింగ్ లో పాల్గున్న రమ్యకృష్ణ

సోగ్గాడే చిన్నినాయన షూటింగ్ లో పాల్గున్న రమ్యకృష్ణ

Published on Jun 30, 2015 12:18 AM IST

nagarjuna-ramyakrishna
‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా షూటింగ్ లో నాగార్జున బిజీ గా వున్న విషయం ఇప్పటికే మేము ప్రకటించాం. ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం చెన్నై లో ఒక షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో వెటరన్ నటి రమ్యకృష్ణ పాలుపంచుకోనుంది. ఈ చిత్రం లో రమ్య కృష్ణ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని సమాచారం. ఆమెతో పాటు ఇతర ముఖ్య తారాగణం ఈ చిత్ర షూటింగ్ లో పాలుపంచుకోనున్నారు.

నాగర్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం లో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తుంది. పి.యెస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

తాజా వార్తలు