గోపీచంద్ సరసన రెజీన కసాండ్ర.?

గోపీచంద్ సరసన రెజీన కసాండ్ర.?

Published on Jul 2, 2015 9:52 AM IST

regina-gopichand
‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్’ ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న గోపీచంద్ తన తదుపరి సినిమా తనకు ‘యజ్ఞం’ రూపంలో తొలి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో చేయనున్న సంగతి ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమాని ఇటీవలే అధికారికంగా లాంచ్ చేసారు. తాజా సమాచారం ప్రకారం చెన్నై బ్యూటీ రెజీన కసాండ్ర ని ఈ సినిమాలో గోపీచంద్ కి హీరోయిన్ గా సెలెక్ట్ చేసారని ఈ చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కెఎస్ రవికుమార్ చెప్పిన స్టొరీ లైన్, హీరోయిన్ రోల్ బాగా నచ్చడంతో ఈ సినిమా పై రెజీన కూడా సముఖతగా ఉందని అంటున్నారు.

గోపీచంద్ — రెజీన కాంబినేషన్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి ప్రారంభం కానుంది. రెజీన కేస్ ఎస్ రవికుమార్ వహించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కి కూడా తనైతే పర్ఫెక్ట్ అనుకొని రవికుమార్ చౌదరి తనని అప్రోచ్ అయ్యాడు. భవ్య క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెజీన సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అది కాకుండా మంచు బ్రదర్స్ అయిన విష్ణు, మనోజ్ లతో చెరో సినిమా చేయడానికి సైన్ చేసింది.

తాజా వార్తలు