‘బాహుబలి 2’ పైన అంచనాలు పెంచేసిన రానా

‘బాహుబలి 2’ పైన అంచనాలు పెంచేసిన రానా

Published on Jul 13, 2015 10:55 AM IST

rana
మూడేళ్ళ పాటు ఊరించిన ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’ గత శుక్రవారం విడుదలై అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ప్రతి చోటా సరికొత్త రికార్డ్స్ కి నాంది పలుకుతోంది.దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ రేమ్బార్ స్టార్ ప్రభాస్ హీరోగా కనిపిస్తే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా దగ్గుబాటి కనిపించాడు. రానా దగ్గుబాటికి బాహుబలి సినిమాతో ఇండియా వ్యాప్తంగా మరింత క్రేజ్ పెరగడమే కాకుండా సూపర్ ఇమేజ్ ని కూడా తెచ్చి పెట్టింది.

ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో రానా తాజా బిబిసి రేడియోలో వినిపించి అందరినీ షాక్ కి గురి చేసాడు. అంతే కాకుండా రానా సెకండ్ పార్ట్ పై మరింత అంచనాలను పెంచేసాడు. ‘బాహుబలిలో నా పాత్ర అంతబాగా రావడానికి కారణం మాత్రం రాజమౌళినే.. అలాగే చెప్పాలంటే బాహుబలి – ది కంక్లూజన్ అనేది బాహుబలి – ది బిగెనింగ్ అనే దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. అది చూసాక ఫస్ట్ పార్ట్ చాలా చిన్నది అనిపిస్తది. పోరాట సన్నివేశాలు, ఎమోషన్స్,సెట్స్ ఇలా అన్నీ సెకండ్ పార్ట్ లో ఎక్కువగా ఉంటాయని’ రానా తెలిపాడు. అనుష్క, తమన్నాలు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఆర్కా మీడియా వారు నిర్మాతలు.

తాజా వార్తలు