‘రోబో’ రికార్డును బ్రేక్ చేసిన ‘బాహుబలి’!

‘రోబో’ రికార్డును బ్రేక్ చేసిన ‘బాహుబలి’!

Published on Jul 14, 2015 8:08 PM IST

Baahubali-pposter
ప్రతి సినీ అభిమానీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసిన సినిమా ‘బాహుబలి’ ఎట్టకేలకు గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మూడేళ్ళుగా ఎదురుచూసాక వచ్చిన ఓ ప్రతిష్టాత్మక సినిమా థియేటర్లలో పడితే ఎలా ఉంటుందో ‘బాహుబలి’ మొదటి వారాంతం కలెక్షన్లు నిరూపించి చూపాయి. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుండీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

బాలీవుడ్‌లో సౌతిండియా సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకున్న దాఖలాలు లేని నేపథ్యంలో వచ్చిన బాహుబలి అక్కడా మంచి కలెక్షన్లను కొల్లగొడుతూ, బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమా రికార్డులను చెరిపేసింది. ఇప్పటివరకూ బాలీవుడ్‌లో శంకర్-రజనీ కాంత్‌ల విజువల్ ఫీస్ట్ ‘రోబో’ మాత్రమే డబ్బింగ్ సినిమాల్లో సత్తా చాటింది. రోబో పూర్తి లాంగ్ రన్‌లో సుమారు 17-18 కోట్ల రేంజ్‌లో వసూల్లు రాబట్టింది. బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాల విషయంలో అప్పటికి రోబోదే రికార్డ్! తాజాగా బాహుబలి రోబో రికార్డును మొదటి మూడు రోజుల్లోనే చెరిపేసింది.

బాహుబలి హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో 28.45 కోట్ల వసూల్లు సాధించి బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాల పరంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.

తాజా వార్తలు