
హాలీవుడ్ స్థాయి సినిమాలను మా టాలీవుడ్ లో కూడా తీయగలం అని నిరూపించిన సినిమా ‘బాహుబలి’. ఆ ఘనతని మన తెలుగు చిత్ర సీమకు తెచ్చిపెట్టిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. విజువల్ వండర్ గా ఆడియన్స్ మదిని గెలుచుకున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ముఖ్య పాత్రలు పోషించారు. బాహుబలి సినిమా చిన్న టౌన్ నుంచి ఓవర్సీస్ దాకా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో ఫస్ట్ వీకెండ్ లో ఆల్ టైం రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది.
ఒక్క నైజాంలోనే మునుపెన్నడూ లేని విధంగా కలెక్షన్స్ వసూలు చేస్తూ ఫుల్ రన్ లో సాధించిన పాత రికార్డ్స్ ని బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. వీక్ డేస్ లో కూడా జాంలో బాహుబలికి స్ట్రాంగ్ కలెక్షన్స్ వచ్చాయి. నాల్గవ రోజు నైజాంలో 2.82 కోట్ల షేర్ సాధించిన బాహుబలి ఐదవ రోజు కూడా 2.20 కోట్ల షేర్ సాధించింది. అలాగే మొదటి వారం పూర్తయ్యేలోపు 21 నుంచి 22 కోట్ల షేర్ ని సాధిస్తుందని నైజాం డిస్ట్రిబూటర్స్ చెబుతున్నారు. నైజాంలో 20 కోట్ల మార్క్ క్రాస్ చెయ్యడం ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. నైజాం ఏరియా మొదటి ఐదు రోజుల షేర్ వివరాలు..
| వారం | కలెక్షన్స్ (షేర్) |
| శుక్ర వారం |
6.22 కోట్లు
|
| శని వారం | 3.55 కోట్లు |
| ఆది వారం | 3.65 కోట్లు |
| సోమవారం | 2.82 కోట్లు |
| మంగళవారం | 2.20 కోట్లు |
| మొత్తం | 18.44 కోట్లు |

