కర్ణాటకలో బిగ్గెస్ట్ రికార్డ్ కి సిద్దమైన ‘బాహుబలి’

కర్ణాటకలో బిగ్గెస్ట్ రికార్డ్ కి సిద్దమైన ‘బాహుబలి’

Published on Jul 15, 2015 7:05 PM IST

baahubali
మన సౌత్ ఇండియాలో భాషా భేదం లేకుండా అన్ని రకాల భాషల సినిమాలను ఎక్కువగా ఆదరించే ప్లేస్ బెంగుళూరు మరియు కర్ణాటక. కర్ణాటకలో కన్నడ సినిమాలకంటే మిగతా భాషల సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుంటాయి. అదే విషయాన్నీ లేటెస్ట్ బాక్స్ ఆఫీసు సెన్సేషన్ బాహుబలి మరోసారి ప్రూవ్ చేసింది. బాహుబలి సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ కాసుల వరద కురిపిస్తూ రికార్డ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. అన్ని భాషలకి దీటుగా కర్ణాటకలో కూడా కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.

కర్ణాటకలో ఎక్కువ థియేటర్స్ లో తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. అదీ కాక కన్నడ స్టార్ హీరో సుధీప్ బాహుబలిలో ఓ చిన్న రోల్ చేయడంతో మరింత క్రేజ్ నెలకొంది. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం బాహుబలి ఓవరాల్ గా క్లోజింగ్ టైంకి ఒక్క కర్ణాటకలోనే 27 నుంచి 30 కోట్ల షేర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు అవ్వడం అక్కడి ట్రేడ్ వర్గాలను షాకింగ్ కి గురిచేస్తున్నాయి. మరోవైపు ఆంధ్ర, తెలంగాణలలో కలుపుకొని 60 కోట్ల మార్క్ కి దగ్గరవుతోంది. అలాగే ఒవర్సీన్ లో 30 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. ఇలా ప్రతిచోటా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తున్న ఈ సినిమాకి తెలుగులో ఈ వారం మరో సినిమా లేకపోవడం ఇంకా పెద్ద హెల్ప్ అని చెప్పవచ్చు.

సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లకి ఉన్న స్టార్డం ఈ సినిమా రికార్డ్స్ ని ప్రధాన కారణం.

తాజా వార్తలు