50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన బాహుబలి 5 డేస్ రిపోర్ట్

50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన బాహుబలి 5 డేస్ రిపోర్ట్

Published on Jul 15, 2015 8:32 PM IST

baahubali11
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బాహుబలి సినిమా సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి థ్రిల్ చేస్తుంటే, మరోవైపు బాక్స్ ఆఫీసు వద్ద ఆ సినిమా కురిపిస్తున్న కాసుల వర్షం ట్రేడ్ వర్గాలను షాక్ కి గురిచేస్తోంది. మునుపెన్నడూ చూడని భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్.. ఇలాంటివన్నీ ఆడియన్స్ ని రంజింపజేస్తున్నాయి. మాస్టర్ మైండ్ అనిపించుకున్న జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. తాజాగా అందిన ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఆంధ్ర – తెలంగాణలతో కలుపుకొని కేవలం 5 రోజుల్లో బాహుబలి సినిమా 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. మూదటి వారం పూర్తయ్యే టైంకి ఇరు రాష్ట్రాల్లో 60 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని తెర్డ్ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి మొదటి 5 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో ఏరియా వైజ్ కలెక్ట్ చేసిన షేర్ వివరాలు మీకోసం..

ఏరియా   కలెక్షన్స్(షేర్)
నైజాం 18.44 కోట్లు
సీడెడ్  10.81 కోట్లు
నెల్లూరు 1.93 కోట్లు
గుంటూరు  4.79 కోట్లు
కృష్ణా   3.16 కోట్లు
పశ్చిమ గోదావరి  4.10 కోట్లు
తూర్పు గోదావరి 4.49 కోట్లు
వైజాగ్  4.62 కోట్
మొత్తం   52.35 కోట్లు

తాజా వార్తలు