
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసి, అన్ని చోట్లా ఆల్ టైం రికార్డ్స్ సృష్టిస్తున్న సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ జక్కన్న మూడేళ్ళ పాటు ఎంతో కష్టపడి చెక్కిన ఈ బాహుబలి టోటల్ గా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది. ప్రతి భాషలోనూ అందరినీ షాకింగ్ కి గురి చేసేలా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులో మొదటి వారం 70 కోట్ల షేర్ మార్క్ టచ్ చేయనుంటే, హిందీలో 35కోట్ల షేర్ మార్క్ ని, తమిళంలో 23 కోట్ల షేర్ మార్క్ ని మరియు మలయాళంలో 3 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేయనుంది. ఇదిలా ఉంటే తాజాగా ట్రేడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం బాహుబలి గ్రాస్ పరంగా సౌత్ ఇండియా ఆల్ టైం రికార్డ్ గా నిలవనుందని సమాచారం.
ఇక విషయంలోకి వెళితే మొదటి 6 రోజుల్లో అన్ని భాషల్లో కలుపుకొని 235కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన బాహుబలి ఫస్ట్ వీక్ లో 250 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. సౌత్ ఇండియాలో ఫస్ట్ వీక్ 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ బాహుబలి. ఇప్పటి వరకూ గ్రాస్ మరియు షేర్ పరంగా అత్యధిక రికార్డ్స్ కలెక్షన్స్ సాధించిన సౌత్ సినిమా రోబో. ట్రేడ్ వర్గాలు చెబుతున్న రిపోర్ట్స్ ప్రకారం సెకండ్ వీకెండ్ ముగిసే టైంకి రోబో సినిమా గ్రాస్ మరియు షేర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి సౌత్ ఇండియన్ నెంబర్ 1 సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని సమాచారం.
ప్రభాస్ శివుడు, బాహుబలి అనే పాత్రల్లో మెప్పిస్తే తమన్నా అవంతికగా, రానా నెగటివ్ షేడ్స్ ఉన్న భళ్లాలదేవగా కనిపించి మెప్పించారు.

