
ఈ ఏడాది టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో ముఖ్యమైనది ‘శ్రీమంతుడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ క్రేజీ మూవీకి ‘మిర్చి’ ఫేం కొరటాల శివ డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో జూలై 18వ తేదీ సాయంత్రం శిల్పకళా వేదికలో జరగనుంది. దీనికి సంబందించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఈ ఆడియో లంచ్ లో మహేష్ బాబు ఆడియన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నాడు అనే విషయానికి వస్తే.. శ్రీమంతుడు ఆడియో లాంచ్ లో 2 నిమిషాలకి పైగా ఉన్న ట్రైలర్ తో పాటు 4 వీడియో సాంగ్స్ ని రిలీజ్ చేయనున్నారు. ఆ నాలుగు సాంగ్స్ లో ఒకటి మాత్రం శ్రీమంతుడులో మహేష్ బాబు స్టిల్స్ తో చేసిన ఓ స్పెషల్ వీడియో అని సమాచారం. ట్రైలర్ కి సంబందించిన డబ్బింగ్ వర్క్ ని కూడా మహేష్ బాబు పూర్తి చేసాడు. ఇప్పటికే ఈ ట్రైలర్ చూసిన పలువురు ప్రముఖులు ట్రైలర్ మరియు వీడియో ప్రోమోస్ అభిమానులకు పెద్ద ట్రీట్ అని అంటున్నారు. వీటితో పాటు దేవీశ్రీ ప్రసాద్ వేదికపై చేయనున్న లైవ్ పెర్ఫార్మన్స్ కూడా హైలైట్ అవుతుందని సమాచారం.
మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. శ్రీమంతుడు సినిమాని మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న రిలీజ్ చేయన్నారు.

