కర్ణాటకలో ‘బాహుబలి’కి అదిరిపోయే కలెక్షన్స్!

కర్ణాటకలో ‘బాహుబలి’కి అదిరిపోయే కలెక్షన్స్!

Published on Jul 17, 2015 9:16 PM IST

baahubali
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో భారీ ఎత్తున విడుదలైన సంచలన విజయాలని నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమా మొదటి వారం ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేసింది.

రాజమౌళి విజన్, ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ చూడనటువంటి విజువల్స్, గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్ వెలసి బాహుబలిని విజువల్ వండర్‌గా నిలబెట్టాయ్! తెలుగు, తమిళ, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా రెండో వారం కూడా స్టడీ కలెక్షన్లతో ప్రారంభమైంది. ఇక కన్నడలో డబ్బింగ్‌కు అవకాశం లేకపోవడంతో నేరుగా తెలుగు వర్షనే రిలీజ్ కాగా ఆ ప్రాంతంలో బాహుబలి దుమ్మురేపే కలెక్షన్లు కొల్లగొట్టింది.

కర్ణాటకలో మొదటివారం ఈ సినిమా దాదాపుగా 20కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి రికార్డు కొట్టింది. రెండోవారం కూడా స్టడీగా నిలబడడం విశేషంగా కనిపిస్తోంది. ఇక బాహుబలి హిందీ వర్షన్ కూడా మొదటివారం 45కోట్లకు పైనే వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించింది.

తాజా వార్తలు