“ఐ.పి.ఎల్ లో మహేష్ జట్టు” – ఒట్టి పుకారే

“ఐ.పి.ఎల్ లో మహేష్ జట్టు” – ఒట్టి పుకారే

Published on Jul 18, 2015 3:00 AM IST

mahesh-and-ramesh
బెట్టింగ్ స్కామ్ లో ఐపిఎల్ లో రెండు మంచి టీంలను రెండేళ్ళ పాటూ సస్పెండ్ ని విధించిన వార్త గతకొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తుంది. దానితోపాటూ ఈ నేపధ్యంలో విశాఖకి సంబంధించిన ఐ.పి.ఎల్ జట్టుని ఒకటి సూపర్ స్టార్ మహేష్ తన బావ జయదేవ్ గల్లాతో కలిసి కొనుగోలు చేయనున్నడన్న వార్త అనితికాలంలోనే ప్రచారం పొందింది.

మహేష్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం, నూతన ఆంద్ర ప్రదేశ్ నుండి ఈ టోర్నీకి కొత్త జట్టుని పరిశీలించడంతో ఈ వార్తలు నిజమేనని నమ్మారు. అయితే ఇవి ఒట్టి గాలివార్తలేనని జయదేవ్ తెలిపారు. ఇటువంటి వాటిలపై తమకు ఉద్దేశం లేదని స్పష్టం చేసారు. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు ఆడియో నేడు విడుదలకానుంది.

తాజా వార్తలు