చరణ్ ని స్టన్ చేసిన బాహుబలి

చరణ్ ని స్టన్ చేసిన బాహుబలి

Published on Jul 18, 2015 11:37 AM IST

ram-charan-about-baahubali

భారతదేశ అతిపెద్ద మోషన్ పిక్చర్ గా విడుదలైన బాహుబలి ఇప్పుడు భారతదేశ అతి పెద్ద విజయంగా నిలిచింది. రాజమౌళి బృందం సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా విడుదలైన ప్రతీ చోటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది.

ఈ సినిమాపై, ఈ చిత్రం అందించిన అనుభూతిపై ఎందరో సెలబ్రిటీలు అంతర్జాల మాధ్యమంలో కొనియాడడం విశేషం. ఇప్పుడు ఈ జాబితాలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు. తన అఫీషియల్ ఫేస్ బుక్ లో “ఇప్పుడే బాహుబలి చిత్రాన్ని చూసాను. రాజమౌళి, విజేందర్ ప్రసాద్, శోభు, సెంథిల్ మరియు ఇతర బృందానికి నా జోహార్లు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ గార్లు సినిమాను మరో ఎత్తుకి చేర్చారు. రెండో భాగం గురించి ఆశగా ఎదురు చూస్తున్నా” తెలిపాడు.

తాజా వార్తలు