‘బాహుబలి’ యూఎస్‌ ఫస్ట్‌వీక్ కలెక్షన్స్ రిపోర్ట్!

‘బాహుబలి’ యూఎస్‌ ఫస్ట్‌వీక్ కలెక్షన్స్ రిపోర్ట్!

Published on Jul 18, 2015 4:27 PM IST

baahubali
ఇప్పుడు ఎక్కడ చూసినా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మికంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సృష్టిస్తోన్న రికార్డుల ప్రస్తావనే! తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషల్లో ఏకకాలంలో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాక, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఈ సినిమాను పలువురు ప్రశంసిస్తున్నారు. మొదటివారం ఈ సినిమా అన్ని చోట్లా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది.

ఇక కేవలం ఇండియాలోనే కాక అమెరికాలోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలి హాలీవుడ్ సినిమాలకు సైతం పోటీగా నిలిచింది. ఇక మొదటివారం ముగిసేసరికి ఈ సినిమా మొత్తం 4.9మిలియన్ డాలర్లతో దూసుకుపోతోంది. ఇండియన్ రూపీలో లెక్కేస్తే సుమారు 31.34కోట్ల రూపాయలతో బాహుబలి రికార్డు సృష్టించిందనే చెప్పాలి. ఈ కలెక్షన్లు కేవలం తెలుగు వర్షన్‌వి మాత్రమే కావడం గమనార్హం. ఓవర్సీస్‌లో హిందీ వర్షన్ జూలై 24న విడుదల కానుంది.

ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బాహుబలి’, అద్భుతమైన విజువల్స్, రాజమౌళి విజన్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. ప్రభాస్, అనుష్క, తమన్నా, అనుష్కలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించింది.

తాజా వార్తలు