
హైదారబాద్ లో ప్రత్యూష అనే అమ్మాయి కి సంబంధించిన వార్త ఆనతికాలంలోనే దశదిశలా వ్యాప్తి చెందింది. ఎల్.బి.నగర్ కి చెందిన ఈ 18 ఏళ్ళ అమ్మాయిని గత సంవత్సరంన్నర కాలంగా ఆమె తండ్రి సవతి తల్లి బాగా టార్చర్ పెట్టి ఇంట్లోనే నిర్భందించేశారు. యాసిడ్ తో ఒళ్ళు కాల్చి ముఖం మీద గాయలు చేసి చివరకు పిచ్చిదని చుట్టుపక్కల వారికి చెబుతూ ఆమెను నానా విధాలుగా చిత్రహింసలు పెట్టేశారు. ఒక చైల్డ్ రైట్స్ యాక్టివిష్టు ఈమెను ఈ నరకం అనబడే ఇంటి నుండి విముక్తిపరిచి రెస్క్యూ హోమ్ లో పెట్టించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ అమ్మాయికి సాయం అందించడానికి చాలామంది ముందుకొస్తున్నారు. పాపులర్ యాక్టర్ పోసాని కృష్ణమురళి కూడా అందులో ఒకరు. ఆ అమ్మాయికి సకల చదువులు చదివించడానికి అయ్యే ఖర్చుతో పాటు జీవితాంతం ఆమెకు కావల్సిన వనరులను తాను సమకూరుస్తానని తెలిపాడు.
తనకే గనుక శిక్షించే అధికారముంటే ప్రత్యూష తల్లిదండ్రులని తీవ్రంగా శిక్షించేవాడినని తెలిపాడు. ప్రత్యూష ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు సమాచారం.

