సౌత్ ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన నయనతార

సౌత్ ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన నయనతార

Published on Jul 19, 2015 11:44 AM IST

Nayanatara

సౌత్ ఇండియాలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న హీరోయిన్స్ లో అందాల భామ నయనతార ఒకరు. గ్యాప్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ వరుస తమిళ్ సినిమాలతో కాస్త కూడా తీరిక లేకుండా షూటింగ్ చేస్తోంది. తాజాగా నయనతార మరో సౌత్ ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్ కార్తీ – దల్క్వేర్ సల్మాన్ లు హీరోగా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని అనుకొని మణిరత్నం ఆమెకి కథ చెప్పాడు. కథ బాగా నచ్చడంతో నయనతార వెంటనే మద్రాస్ టాకీస్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

గతంలో కూడా మణిరత్నం తను తీసిన రావన్ సినిమాలో ప్రియమణి చేసిన పాత్ర కోసం నయనతార అప్రోచ్ అయ్యారు. కానీ అప్పట్లో ఆ ఆఫర్ ని నయనతార సున్నితంగా తిరష్కరించినది. కానీ ఇప్పుడు నయనతార మణిరత్నం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి కొమాలి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నాడు.

తాజా వార్తలు