సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు ఆడియో రిలీజ్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో మహేష్ బాబుని ప్రెజంట్ చసిన విధానం, అతని లుక్ మరియు డైలాగ్ డెలివరీ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. అంతే కాకుండా ఓ సోషల్ మెసేజ్ ఉన్న పాయింట్ ని చాలా కమర్షియల్ గా చెప్పడంతో ట్రైలర్ కి అందరి నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ట్రైలర్ చూసి సూపర్బ్ హ్యాపీగా ఉండడమే కాకుండా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు.
అలాగే విడుదల చేసిన సాంగ్ ట్రైలర్స్ లో మహేష్ బాబు స్టూడెంట్ గా కనిపించడం, మహేష్ – శృతి హాసన్ ల కెమిస్ట్రీ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో నిన్నటి నుంచీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. జగపతి బాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, అంగన రాయ్, సనమ్ శెట్టి, రాహుల్ రవీంద్రన్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


