ఫ్యాన్స్ తో ‘బాహుబలి’ చూడనున్న ప్రభాస్

ఫ్యాన్స్ తో ‘బాహుబలి’ చూడనున్న ప్రభాస్

Published on Jul 20, 2015 8:10 AM IST

prabhas

ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇండియా మొత్తం హల్ చల్ చేస్తున్న పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీనికి కారణం ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమా 10 రోజుల క్రితం రిలీజ్ అయ్యి ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు భాషల్లోనూ సూపర్ హిట్ అవడం వలన ప్రభాస్ చాలా చాలా హ్యాపీ హ్యాపీ గా ఉన్నాడు. ఇటీవలే చెన్నై వెళ్లి ప్రెస్ మీట్ ద్వారా సినిమా విజయం చేసినందుకు తమిళ ఆడియన్స్ కి థాంక్స్ చెప్పాడు.

ఇప్పుడు అదే రీతిలో తెలుగు ఆడియన్స్ కి కూడా సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఆ సర్ప్రైజ్ ఏమిటంటే ప్రభాస్ రేపు అభిమానులతో కలిసి హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో బాహుబలి మార్నింగ్ షో సినిమా చూడనున్నాడు. అలాగే సినిమా అయ్యాక అభిమానులతో మాట్లాడనున్నాడు. ప్రభాస్ తన అభిమానులు, సినీ ప్రేక్షకులు సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారా అన్నది లైవ్ లో ఫీల్ అయ్యి వాళ్ళకి స్పెషల్ థాంక్స్ చెప్పడం కోసం ఇలా షో చూడనున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు