కమల్ మూవీతో నటుడిగా మారిన ఫేమస్ లిరిసిస్ట్

కమల్ మూవీతో నటుడిగా మారిన ఫేమస్ లిరిసిస్ట్

Published on Jul 20, 2015 7:11 PM IST

rama-jogaya-sastry
నటులుగా వచ్చిన వారు, టెక్నీషియన్స్ గా పనిచేసిన వారు దర్శకులుగా మారడం, అలాగే దర్శకులు నటులుగా మారడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరుగుతూ ఉండే విషయమే..కానీ పాటల రచయితలు నటులుగా మారి తెరపై కనిపించడం చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే టాలీవుడ్ ఫేమస్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి నటుడిగా మారాడు. గతంలో రామజోగయ్య శాస్త్రి నాగార్జున నటించిన ‘కింగ్’ సినిమాలో ఒకే సీన్ లో లిరిసిస్ట్ గా అలా కనిపించి వెళ్ళిపోయాడు.

కానీ తాజాగా ఆయన కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘చీకటి రాజ్యం’ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి చేసేది చాలా చిన్న పాత్ర అయినా సినిమాకి చాలా కీలకం అని ఈ చిత్ర టీం చెబుతోంది. కమల్ హాసన్ – త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేస్తున్నారు. కమల్ అసిస్టెంట్ రాజేష్ సెల్వ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాని కమల్ తన హోం బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు