
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి తెలుగు వారంతా కాలర్ ఎగరేసుకునేలా చేసిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 12 రోజులు. కానీ థియేటర్స్ దగ్గర మాత్రం ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదు. నిజాం ఏరియాలో 2వ వారం వీక్ డేస్ లో కూడా 80% థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సినిమాకి ఇంకా తగ్గని క్రేజ్ మరియు కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇదిలా ఉంటే గత నెల రోజులుగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ వర్క్స్ మరియు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న జక్కన్న అలియాస్ రాజమౌళి జూలై 17న ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్ళాడు.
రాజమౌళి సింపుల్ గా కేవలం 5 రోజుల్లోనే తన షార్ట్ హాలిడే ట్రిప్ ని ఫినిష్ చేసుకొని ఇండియాకి తిరిగి వస్తున్నాడు. రేపటికి ఇండియా రీచ్ కానున్న రాజమౌళి ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా బాహుబలి పార్ట్ కి సంబందించిన వర్క్ ని మొదలు పెట్టనున్నాడు. బాహుబలి 2 స్క్రిప్ట్ ని మరోసారి సరిచేసుకొని, దానికి కావాల్సిన సెట్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ని మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తైన సెకండ్ పార్ట్ ని పూర్తి చేయడం కోసం ఇంకా 120 రోజులపైనే షూటింగ్ చేయాల్సి ఉంది. సెకండ్ పార్ట్ షూట్ సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ ప్రస్తుతం కొద్ది రోజులు హాలిడే కి వెళ్ళే మూడ్ లో ఉంటే, రానా తమిళ బెంగుళూరు డేస్ రీమేక్ షూట్ ని ఫినిశ్క్ హేసే పనిలో ఉన్నాడు.

