పుష్కరాల వద్ద అట్రాక్షన్ గా మారిన తెలుగు లెజెండ్స్

పుష్కరాల వద్ద అట్రాక్షన్ గా మారిన తెలుగు లెజెండ్స్

Published on Jul 22, 2015 12:00 PM IST

legends

తెలుగు ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో పవిత్రంగా భావించే గోదావరి మహా పుష్కరాలు రాజమండ్రి, భద్రాచలం మొదలైన ప్రాంతాల్లో జూలై 14న మొదలైంది. జూలై 26తో ముగియనున్న ఈ గోదావరి పుష్కరాలు చివరి దశకు చేరుకోవడంతో గోదావరి తీరాన భక్త జనసందోహం మరింత పెరుగుతోంది. ఇదిలా ఉంటే గోదావరి పుష్కరాలకు వస్తున్న వారిని తెలుగు సినిమా లెజెండ్స్ విగ్రహాలు ఆకర్షిస్తున్నాయి. తెలుగు ప్రజలందరూ అన్న అని పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారకరామారావు మరియు స్నేహ బంధానికి మారుపేరైన బాపు – రమణల విగ్రహాలను రాజమండ్రి గోదావరి పుష్కరాల ప్రాంతంలో ప్రతిష్టించారు.

నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి గోదావరి పుష్కరాల విఐపి ఘాట్ వద్ద మొదటగా నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత బాపు ఘాట్ వద్ద బాపు – రమణల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ లెజెండ్స్ ని చూసి స్ఫూర్తి తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు కోరారు. విశిష్ట గోదావరి ప్రాంతలో బాపు గారికి గుర్తుగా బాపు ఘాట్ అని ఓ ప్లేస్ కి పేరు కూడా పెట్టారు.

తాజా వార్తలు