
అక్కినేని యువ కెరటం అఖిల్ తొలి చిత్రం వి.వి వినాయక్ దర్శకత్వంలో శరవేగంగా సాగిపోతుంది. అఖిలే కాక ఈ చిత్రం ద్వారా సాయేషా సైఘల్ కూడా హీరోయిన్ గా పరిచయం కానుంది. సాయేషా బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ వారసురాలు. ఈ భామ వినాయక్ దర్శకత్వంలో నటించడం చాలా లక్కీ అని దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది.
ఒక ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అఖిల్ చాలా మంచి కో స్టార్ అని తెలిపింది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 70శాతం వరకూ పూర్తయింది.. త్వరలో చివరి షెడ్యూల్ మొదలుకానుంది.

