ప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్

ప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్

Published on Jul 23, 2015 2:13 PM IST

allu-arjun
మెగా మరియు అల్లు ఫ్యామిలీ నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అల్లు అర్జున్ తనదైన మార్క్ తో స్టైలిష్ స్టార్ గా తెలుగులో తనకంటూ ఓ స్టార్డం తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ హీరోగా, పలు ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్ తాజాగా ఇండియా లో ఫేమస్ అవుతున్న ప్రో కబడ్డీ లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యాడు. 2014 లో మొదలైన ప్రో కబడ్డీ లీగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సంవత్సరం జరగనున్న ప్రో కబడ్డీ లీగ్ కి మరింత క్రేజ్ నెలకొంది.

అంతే కాకుండా ఈ ఏడాది నుంచి తెలుగు వారి ‘తెలుగు టైటన్స్’ కి స్పెషల్ సపోర్ట్ ఇవ్వాలని అల్లు అర్జున్ ని ఎంపిక చేసారు. దీంతో టీం మరింత బాగా పెర్ఫార్మన్స్ చూపిస్తుందని స్పాన్సర్స్ భావిస్తున్నారు. అల్లు అర్జున్ జాతీయ గీతం పాడి అల్లు అర్జున్ తెలుగు టైటన్స్ టీంని లాంచ్ చేసాడు. అల్లు అర్జున్ తనకి కబడ్డీ అంటే ఇష్టం అని అందుకే ఈ ప్రో కబడ్డీ లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకున్నానని తెలిపారు. హైదరబాద్ మ్యాచ్ లు అన్నీ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తదుపరి సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఉండనుంది. జూలై 26 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు