టార్గెట్ పెట్టుకొని ‘బాహుబలి 2’ ఫినిష్ చేయనున్న రాజమౌళి

టార్గెట్ పెట్టుకొని ‘బాహుబలి 2’ ఫినిష్ చేయనున్న రాజమౌళి

Published on Jul 23, 2015 11:52 PM IST

baahubali11
తెలుగు మరియు ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ రాని సూపర్బ్ విజువల్స్ తో వచ్చి యావత్ భారతదేశాన్ని మెప్పిస్తూ రికార్డ్స్ కొల్లగొడుతున్న సినిమా ‘బాహుబలి’. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే రెండు పార్ట్స్ గా ఈ సినిమాని చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఈ ఏడాది ‘బాహుబలి – ది బిగెనింగ్’ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి బద్దలు కొడుతున్న రికార్డ్స్, దానికున్న క్రేజ్, ప్రశంశలు ఇవన్నీ పక్కన పెడితే.. అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న “కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు.?”.. ఈ ప్రశ్నకి సమాధానం కోసం ‘బాహుబలి – ది కంక్లూజన్’ కోసం వేచి చూడాల్సిందే.

ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసమే రాజమౌళి చాలా చిన్న హాలిడే ట్రిప్ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి నేటి నుంచి బాహుబలి 2 వర్క్ మొదలు పెట్టాడు. బాహుబలి సెకండ్ పార్ట్ ని త్వరగా ఫినిష్ చేసి అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని తన టీంకి కూడా చెబుతూ ఇప్పటి నుంచే సెకండ పార్ట్ షూట్ కి కావాల్సిన అన్ని పనులను స్పీడప్ చేస్తున్నాడు. సెకండ్ పార్ట్ షూట్ విషయంలో కూడా పర్ఫెక్ట్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నాడు. సెప్టెంబర్ నుంచి సెకండ్ పార్ట్ షూట్ మొదలవుతుంది. ఈ లోపు రాజమౌళి స్క్రిప్ట్ మరో సారి పర్ఫెక్ట్ గా స్టడీ చేసి ఏమన్నా అవసరం అయితే మార్పులు కూడా చేసే పనిలో ఉన్నాడు. ఓ టార్గెట్ పెట్టుకొని పగడ్బందీగా రాజమౌళి సెకండ్ పార్ట్ ని ఫినిచ్ చేయనున్నాడని సమాచారం.

తాజా వార్తలు