ప్రతి సినిమాలోనూ తన లుక్ మరియు పాత్రల సెలక్షన్ లో వేరియేషణ్ చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఏడాది ‘S/O సత్యమూర్తి’ సినిమాతో హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయనున్నాడు. ఈ సినిమా జూలై 26 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ ‘ప్రో కబడ్డీ లీగ్’ లో ‘తెలుగు టైటన్స్’కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడని తెలియజేశాం.
తాజాగా ప్రో కబడ్డీ లీగ్ ని అనౌన్స్ చెయ్యడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో బన్ని తన మనసులోని కోరికని బయట పెట్టారు. ‘నాకు క్రీడలంటే ఇష్టం. సినిమాల తర్వాత ఇష్టమైన రంగం అంటే స్పోర్ట్స్. ఓ మంచి స్పోర్ట్స్ కథతో నా దగ్గరికి వస్తే సినిమా చేయడానికి నేను ఎప్పుడు సిద్దమే.. కానీ కథ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని’ అల్లు అర్జున్ తెలిపాడు. ఈ స్టేట్మెంట్ తో బన్నికి సూట్ అయ్యే స్పోర్ట్స్ కథని మన దర్శకులు రచిస్తారేమో చూడాలి. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా కోసం లుక్ అండ్ ఫిజిక్ ని మార్చుకునే పనిలో ఉన్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో రానున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రేసాలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు.


