డిసెంబర్ లో రానున్న నారా రోహిత్ ‘సావిత్రి’

డిసెంబర్ లో రానున్న నారా రోహిత్ ‘సావిత్రి’

Published on Jul 25, 2015 9:33 AM IST

Savitri
సినిమా సినిమాకి ఏదో ఒక సరికొత్త వైవిధ్యాన్ని చూపిస్తూ యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకతని ఎర్పరుచుకుంటున్న హీరో నారా రోహిత్. ఈ ఏడాది ‘అసుర’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నారా రోహిత్ ఈ ఏడాది వరుసగా సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. నారా రోహిత్ ఇటీవలే ప్రారంభించిన మూవీ ‘సావిత్రి’. ‘ప్రేమ్ ఇష్క్ కాదల్’ లాంటి ఓ డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ పవన్ సాధినేని ఈ సినిమాకి డైరెక్టర్. చాలా రోజుల క్రితమే నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ సినిమా కోసం నార రోహిత్ సరికొత్త మేకోవర్ కోసం ట్రై చేస్తుండడం వలన ఆలస్యం అయ్యింది.

సావిత్రి రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది. ఈ సినిమాని మొదలు పెట్టి 3 నెలల్లో షూటింగ్ తో పాటు మిగిలిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేలా నారా రోహిత్ టీం ప్లాన్ చేసింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నాడు. నారా రోహిత్ సరసన నందిత హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలో నారా రోహిత్ స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. పవన్ సాధినేనితో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం మొత్తం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య డైలాగ్స్ అందిస్తుంటే, శ్రవణ్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నారా రోహిత్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు