
‘గోపాల్ గోపాల’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమరా ముందుకు వచ్చి సుమారు 7 నెలల పైనే అయ్యింది. పవన్ కళ్యాణ్ అంటే ఓ పిచ్చి క్రేజ్ ఉన్న అభిమానులు తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలు పెడతాడా.. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా ‘సర్దార్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాకి ముందుగా గబ్బర్ సింగ్ 2 అనే టైటిల్ అనుకున్నా ఫైనల్ గా ‘సర్దార్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. షూటింగ్ మొదలైన ఈ సినిమా ఫస్ట్ అండ్ షార్ట్ షెడ్యూల్ పూణేలో జరిగింది. ఆ తర్వాత ఈ చిత్ర టీం ఈ సినిమా కోసం పలు లొకేషన్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉనింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జూలై 29నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ కూడా షూట్ లో జాయిన్ అవనున్నాడని ఈ చిత్ర డైరెక్టర్ బాబీ తెలియజేశాడు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పెంచుతున్న గడ్డం ఈ సినిమా కోసమే అని, పవన్ సర్దార్ గెటప్ లో కనిపిస్తాడని సమాచారం. పవన్ కళ్యాణ్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది. పవన్ కోసం బాబీ పక్కా స్క్రిప్ట్ ని రెడీ చేయడమే కాకుండా, మ్యూజిక్ సిట్టింగ్స్ లో దేవీశ్రీ నుంచి సూపర్బ్ సాంగ్స్ ని రాబట్టుకున్నాడని సమాచారం. మరాఠీ నటుడు శరత్ కేల్కర్ ని విలన్ గా పరిచయం చేస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత.

