
ప్రొడ్యూసర్‌గానే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్‌రాజు ‘పట్టిందల్లా బంగారమే’ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవకాలంలో ‘గోల్డెన్ రాజు’గానూ వ్యవహరించబడుతున్న దిల్‌రాజు తాజాగా ‘బాహుబలి’ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ చిత్రం తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రను తిరగరాయడం సైతం తెలిసిందే. అటువంటి దిల్‌రాజు ‘బాహుబలి’ అనంతరం ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాలు ఫ్యాన్సీ ఆఫర్లతో బిజినెస్ జరుపుకొని, అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కు దిల్‌రాజు సొంతం కావడంతో ఈ సినిమాపై గల క్రేజ్ మరింత పెరుగుతోంది.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ… ‘‘బాహుబలి’ వంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత నైజాంలో మేం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ‘సినిమా చూపిస్త మావ’. ఈ సినిమా గురించి గత కొన్ని వారాలుగా వింటూనే ఉన్నాను. దాంతో సినిమా చూపించమని నిర్మాతలను అడిగితే` సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ నాకు సినిమా చూపించారు. వాళ్లూ వీళ్లూ చెప్పిన మాట ద్వారా` ‘సినిమా చూపిస్త మావ’ చిత్రంపై కొంత ఎక్స్‌పెక్టేషన్‌తో సినిమా చూసిన నేను.. సినిమా చూసి స్పెల్‌బౌండ్ అయిపోయాను. ఇటీవకాంలో ఓ చిన్న సినిమా ఇంత వండర్‌ఫుల్‌గా రావడం జరగలేదు. వెంటనే మా శిరీష్‌ను కూడా చూడమని చెప్పాను. తనకి కూడా విపరీతంగా నచ్చేసింది. సెకండ్ ధాట్ లేకుండా.. ప్రొడ్యూసర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న మొత్తానికి.. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొన్నాను. ఈ సందర్భంగా ‘సినిమా చూపిస్త మావ’ నిర్మాతతోపాటు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్‌చంద్ర, డైలాగ్ రైటర్ ప్రసన్నకుమార్ తదితరును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాజ్‌తరుణ్-అవికాగోర్ నటించిన ‘ఉయ్యాల జంపాల’ కంటే.. వాళ్లిద్దరూ రెండోసారి కలిసి నటించిన ‘సినిమా చూపిస్త మావ’ మరింత పెద్ద విజయం సాధించడం ఖాయం’ అన్నారు.
అంజిరెడ్డి ప్రొడక్షన్స్-ఆర్.డి.జి ప్రొడక్షన్స్ ప్రై॥లి॥ సంయుక్త సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్ (గోపి)-రూపేష్ డి.గోహిల్-జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే!!
నైజాంలో ‘సినిమా చూపిస్త మావ’ అంటున్న దిల్‌రాజు!!
నైజాంలో ‘సినిమా చూపిస్త మావ’ అంటున్న దిల్‌రాజు!!
Published on Aug 4, 2015 8:00 PM IST
సంబంధిత సమాచారం
- బిగ్ ట్విస్ట్: విజయ్ సీఎం కాకుండా బ్రేక్? ఊహించని మలుపులు ఎదుర్కొంటున్న దళపతి?
- రవిబాబు షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీనే థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని చంపేస్తుంది
- Emotional Video: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన దళపతి.. జీవాను ఓదారుస్తూ ఎమోషనల్ అయిన విజయ్
- SRH vs PBKS IPL 2026: క్లాసెన్ ఊచకోత, ఇషాన్ విధ్వంసం.. టేబుల్ టాపర్‌గా సన్‌రైజర్స్!
- ఇంటర్వ్యూ: లావణ్య త్రిపాఠి కొణిదెల – ‘సతీ లీలావతి’ ఎంతో రిఫ్రెషింగ్ గా ఫన్ గా ఉంటుంది
- ‘లెనిన్’ నుంచి ఇంకెన్ని సర్ప్రైజులో!
- ‘స్పిరిట్’ వాయిదా పడిందా? సాలిడ్ క్లారిటీ బయటకి
- ‘పెద్ది’ కథ జరిగే సమయం రివీల్.. 24 భారీ సెట్స్ తో ‘రంగస్థలం’ని మించి
- సామ్ ‘మా ఇంటి బంగారం’కి కొత్త రిలీజ్ డేట్ ఇదే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- వైరల్ వీడియో: భారీ విన్నింగ్ ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న దళపతి విజయ్
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- ట్విస్ట్: విజయ్ స్థానంలోకి త్రిష ఎంట్రీ?
- NBK 112: బాలయ్య కోసం ఆ ఇద్దరిలో ఒకరు?
- బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్.. ధనుష్ క్రేజ్ తగ్గిందా..?
- విజయ్ కి మహేష్ స్పెషల్ విషెస్..!
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!

