రావణుడిగా చేయాలంటున్న టాలీవుడ్ కింగ్

రావణుడిగా చేయాలంటున్న టాలీవుడ్ కింగ్

Published on Aug 12, 2015 11:56 AM IST

nagarjuna
టాలీవుడ్ అల్లా టైం రికార్డ్ హిట్ గా నిలిచిన ‘బాహుబలి’ సినిమా వచ్చాక అందరు స్టార్ హీరోలు చారిత్రాత్మక, పీరియడ్ ఫిల్మ్స్ చెయ్యడానికి ఆసక్తిని చూపడమే కాకుండా తమ మనసులో ఉన్న కోరికలని కూడా బయటపెడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే కింగ్ నాగార్జున విషయంలో జరిగింది. టాలీవుడ్ రొమాంటిక్ హీరో కింగ్ నాగార్జున బాహుబలి లాంటి పీరియడ్ ఫిల్మ్ లో తనకి రామాయణంలో మెయిన్ విలన్ అయిన రావణబ్రహ్మ/రావణుడి పాత్రలో నటించాలని ఉందనే తన కోరికని బయటపెట్టాడు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ‘కాళీ’ బుక్ లాంచ్ కి హాజరైనప్పుడు నాగార్జున ఈ విషయాన్ని తెలిపాడు.

ఈ కార్యక్రమంలో నాగార్జున తనకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడుతూ ‘నా చిన్నప్పటి నుంచీ ఎన్నో పౌరాణిక, జానపద కథలను వింటూ పెరిగాను. వీటితో పాటు ఎన్.టి.ఆర్, ఎఎన్ఆర్ లు చేసిన పౌరాణిక సినిమాలు చూస్తూ పెరిగాను, అందుకే అలాంటి సినిమాల్లో నటించాలని ఉందని’ తెలిపాడు. అలాగే బాహుబలి గురించి మాట్లాడుతూ ‘బాహుబలి సినిమాలో నేను నటించలేకపోయినందుకు బాగా ఫీలయ్యాను, అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటులపై ఈర్ష కూడా కలిగిందని’ నాగార్జున తెలిపాడు. నాగార్జున తదుపరి సినిమాల విషయానికి వస్తే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది, మరోవైపు కార్తీ, తమన్నాలతో కలిసి చేస్తున్న ద్విభాషా చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు