‘శ్రీమంతుడు’ని చూసేందుకు సిద్ధమైన కమల్ హాసన్

‘శ్రీమంతుడు’ని చూసేందుకు సిద్ధమైన కమల్ హాసన్

Published on Aug 12, 2015 11:25 PM IST

kamal-hassan-srimanutud
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాటినుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక సోషల్ మెసేజ్ ఉన్న కథాంశాన్ని కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన విధానానికి అన్ని వర్గాల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులే కాక రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించడం విశేషంగా కనిపిస్తూ వచ్చింది.

ఇదిలా ఉంటే.. శ్రీమంతుడు సినిమాను చూసేందుకు లెజెండరీ దర్శకుడు కమల్ హాసన్ కూడా సిద్ధమైపోయారట. రేపు చెన్నైలో ఆయన ఈ సినిమా చూడనున్నారన్న విషయాన్ని శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన కమల్ కూతురు శృతి హాసన్ తెలియజేశారు. కేవలం 5 రోజుల్లోనే 50 కోట్ల వసూళ్ళు రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్‌లో మరింత కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌తో కలిసి మహేష్ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు