రామ్ చరణ్ మూవీ క్లైమాక్స్ ఫైట్ ఖర్చు 4 కోట్లు.!

రామ్ చరణ్ మూవీ క్లైమాక్స్ ఫైట్ ఖర్చు 4 కోట్లు.!

Published on Aug 13, 2015 10:39 PM IST

Ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్స్ స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. ఇటీవలే థాయ్ ల్యాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం నేటి నుంచి హైదరబాద్ లో ఓ ఫ్రెష్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన సంగతో ఇది వరకే తెలియజేశాం. సుమారు 20 రోజుల పైనే జరిగిన థాయ్ ల్యాండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేసారని తెలిపాం. అది కూడా నది సముద్రంలో ఓ పెద్ద షిప్ లో చేసారని తెలిపాం.

లేటెస్ట్ గా ఈ చిత్ర టీం తెలిపిన న్యూస్ ప్రకారం రామ్ చరణ్ – శ్రీను వైట్ల మూవీలో ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ చెయ్యడానికే సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలిపారు. ఈ క్లైమాక్స్ ఫైట్ లో వాడిన గిగ్గేస్ట్ షిప్ కి రోజుకి 16 లక్షల రెంట్ కట్టి 10 రోజులు ఆ షిప్ లోనే షూట్ చేసారు. ఈ ఫైట్ లో భాగంగానే సముద్రంలో వచ్చే ఓ బోట్ చేజింగ్ సీక్వెన్స్ ని కూడా కూడా తీసారు. ఈ మొత్తం యాక్షన్ ఎపిసోడ్ కి అక్షరాల 4 కోట్లు అయ్యిందని ఈ చిత్ర టీం అంటోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపిస్తుండడం వలన యాక్షన్ ఎపిసోడ్స్ మరింత సూపర్బ్ గా వచ్చేలా కేర్ తీసుకుంటున్నారు.

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు