
విలన్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా ఎంటర్టైన్ చేసి, నిర్మాతగా 50కి పైగా చిత్రాలను నిర్మించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మొదటిసారి తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న హీరో అల్లరి నరేష్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి ‘మామ మంచు – అల్లుడు కంచు’ అనే టైటిల్ ని ఫైలైజ్ చేసారు. ఆగష్టు మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాడ్ లో మొదలు పెట్టారు. ఒక వారం రోజుల పాటు జరిగిన ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది.
మాకు అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఆగష్టు 19 నుంచి తిరుపతిలో మొదలు కానుంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో సినిమాలోని మేజర్ టాకీ పార్ట్ ని ఫినిష్ చేయనున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు – అల్లరి నరేష్ లు మామ అల్లుల్లుగా కనిపించి తెలుగు ప్రేక్షకులను నవ్వించనున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబుకి జోడీగా అలనాటి స్టార్స్ రమ్యకృష్ణ, మీనాలు నటిస్తున్నారు. ఓ మరాఠీ సినిమాకి స్పూర్తిగా తీసుకొని చేస్తున్న ఈ సినిమా కథని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసాడు. మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

