పెళ్ళి పనులతో బిజీ కానున్న అసిన్!

పెళ్ళి పనులతో బిజీ కానున్న అసిన్!

Published on Aug 13, 2015 8:00 PM IST

Asin
అసిస్.. ‘అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అతి కొద్దికాలంలోనే స్టార్‌గా ఎదిగిన హీరోయిన్. అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. తమిళ సినిమా ‘గజని’లో ఆమె పోషించిన కల్పన పాత్ర అదే పేరుతో హిందీలోకి అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ అయినా కల్పనగా మాత్రం అసిన్ మారలేదు. హిందీ గజినితో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అసిన్, ఆ తర్వాత అక్కడా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే గత రెండేళ్ళుగా మైక్రోసాఫ్ట్ మొబైల్స్ ఫౌండర్ రాహుల్ శర్మతో డేటింగ్‌లో ఉన్న ఆమె, అతని కోసమే సినిమాలు తగ్గించుకున్నారు. 2012 తర్వాత ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా ఆల్ ఈజ్ వెల్ త్వరలో విడుదల కాబోతోంది. ఇక రాహుల్ శర్మతో తన బంధాన్ని పెళ్ళి పీటల వరకూ తీసుకెళ్ళే ఆలోచన చేసిన అసిన్, సినిమాలను దాదాపుగా మానేస్తున్నట్లు తెలిపారు. రాహుల్ శర్మను త్వరలోనే పెళ్ళాడనున్నట్లు అసిన్ ఈ మధ్యే ప్రకటించారు. ఇక పెళ్ళి ఎప్పుడనే విషయం ఇప్పటికీ ప్రకటించకపోయినా, మనకందుతున్న సమాచారం మేరకు మరో కొద్ది నెలల్లోనే పెళ్ళి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యక్రమాల గురించి అసిన్ ఆలోచిస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు