ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీ రిలీజ్ డేట్

ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీ రిలీజ్ డేట్

Published on Aug 14, 2015 2:16 PM IST

ntr-new-still
సినిమా సినిమాకి పొంతన లేకుండా డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలని ట్రై చేసే సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్న సంగతి సినిమా తెలిసిందే. ఎన్.టి.ఆర్ తన లుక్ మొత్తం మార్చుకొని అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ జూలై మొదటి వారంలో లండన్ లో ప్రారంభమైంది. ఎన్.టి.ఆర్ సినిమా మొదలైన నాటి నుంచి ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఎన్.టి.ఆర్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర టీం శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్ సింగ్ లపై వచ్చే ఓ రొమాంటిక్ డ్యూయెట్ ని షూట్ చేసారు. ఈ సాంగ్ షూట్ ఫినిష్ అవ్వడంతో మళ్ళీ టాకీ సీన్స్ తీస్తున్నారు.

సినిమా లాంచ్ అయినప్పుడే ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. కానీ పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. తాజాగా ఈ చిత్ర టీం 2016 జనవరి 8న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్ణయించుకుంది. ఆ రిలీజ్ డేట్ ప్రకారమే సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాకి నాన్నకు ప్రేమతో అనీ టైటిల్ ని పరిశీలిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొద్ది సేపటి క్రితమే ఈ మూవీలోని ఎన్.టి.ఆర్ స్టిల్ ని రిలీజ్ చేసారు. సెప్టెంబర్ చివరి వరకూ ఈ సినిమా షూటింగ్ లండన్ లోనే జరుగుతుంది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని 90% షూటింగ్ అబ్రాడ్ లోనే జరగనుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు